MLC అభ్యర్థుల విజయం అతిథి అధ్యాపకుల విజయం

రెండు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు వాణీ దేవిలకు తెలంగాణా జూనియర్ కళాశాలలో పని చేస్తున్న జూనియర్ అతిథి అధ్యాపకుల సంఘం (1145)రాష్ట్ర అద్యక్షులు యాకుబ్ పాషా అతిథి అధ్యాపకుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు.

మన కోసం నిలిచిన అభ్యర్ది మన సమస్యలు తెలిసిన, పరిష్కరించగలిగే అధికారం, అవగాహన ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అతిధి అధ్యాపకులకు ఈ సందర్భంగా పాషా ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జిల్లా అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Follow Us@