పల్లా రాజేశ్వర్ రెడ్డికే జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సంఘం పూర్తి మద్దతు

టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తూ..రాష్ట్ర కమిటీ ఏకగ్రీవ తీర్మాణం

ఈ నెలలో జరగనున్న వరంగల్, నల్గొండ, ఖమ్మం మరియు హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్సీ డా,, పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు తనయ, ఉన్నత విద్యావంతురాలు సురభి వాణీదేవీ లకే సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దామెర ప్రభాకర్, దార్ల భాస్కర్ లు తెలిపారు.

ఈ సందర్భంగా మంగళవారం నాడు నిర్వహించిన రాష్ట్ర స్తాయి ఆన్లైన్ సమావేశంలో..వివిధ జిల్లాల నుండి హాజరైన రాష్ట్ర, జిల్లా నాయకుల అబిప్రాయం మేరకు రెండు సెగ్మెంట్లలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీ దేవీ ల గెలుపుకై మద్దతు ప్రకటిస్తూ..ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఈ సమావేశ వివరాలను తెలియజేస్తూ..ఈ ఒక్క ఎమ్మెల్సీ స్థానాలను గెలవడంతో విపక్షాలు, స్వతంత్రులు ఒరగబెట్టేది ఏమీ ఉండదని, ప్రశ్నించే వారు కాకుండా పని చేయగలిగే సత్తా ఉన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి, వాణీ దేవీలనే గెలిపించాలని ఆయా ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న దాదాపు 1000 మంది గెస్ట్ లెక్చరర్లను కోరారు.

అదేవిధంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి కృషి వల్లనే తాము ఈ విద్యా సంవత్సరం కొనసాగుతున్నామని, కరోనా విపత్కర పరిస్థితులలో కూడా జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్ల సమస్యలను సావధానంగా విని, మంత్రులతో, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చూపేలా పల్లా ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు. ఈ క్రమంలో..తదుపరి సమస్యల పరిష్కారం కూడా పల్లాతోనే సాధ్యమవుతుందని ప్రగాఢ విశ్వాసం, నమ్మకం తెలియజేస్తూ..నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి, హైద్రాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ వాణీదేవీలకు గెస్ట్ లెక్చరర్లంతా తమ మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని సంబంధించి ఉమ్మడి జిల్లాల నాయకులను కోరారు.

ఈ సమావేశంలో సంఘ ఉపాధ్యక్షుడు కే దేవేందర్, రాష్ట్ర నాయకులు ఎం. బాబురావు, కే మహేష్ కుమార్, ఎస్. వెంకటేష్, మారుతి, సురేందర్ రెడ్డి, దానప్ప, చిరంజీవి, జైపాల్, ఇస్సాక్, దానప్ప, వెంకటేష్, రాంమూర్తి, సాయికృష్ఞ తదితరులు పాల్గొన్నారు.

Follow Us@