Home > EMPLOYEES NEWS > MTS లోకి మారాలని కనకదుర్గమ్మను మొక్కుకున్న గెస్ట్ అధ్యాపకులు

MTS లోకి మారాలని కనకదుర్గమ్మను మొక్కుకున్న గెస్ట్ అధ్యాపకులు

BIKKI NEWS (SEP. 22) : guest lecturers requesting for MTS. గత 10 సంవత్సరాలుగా గెస్ట్ జూనియర్ లెక్చరర్స్ గా పని చేస్తున్న తమను MTS (మినిమం టైం స్కేల్) లోకి మార్చాలని 2152 రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ అమ్మ వారిని దర్శించుకుని మెక్కుకున్నట్లు రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరకు దేవయ్య, క్రియాశీలక సిద్దిపేట్ జిల్లా సభ్యులు బాల్ లింగం, అశోక్, రేవంత్ మరియు రమణ చారి తెలిపారు.

guest lecturers requesting for MTS

ఈ సందర్భంగా దేవయ్య మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల జిల్లా కమిటీల ఆధ్వర్యంలో 1,654 మంది గెస్ట్ లెక్చరర్లను MTS (మినిమం టైం స్కేల్) లోకి మార్చాలని రాష్ట్రవ్యాప్తంగా అందరి ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను కలిసి విన్నవించడం జరిగిందని … గత పది సంవత్సరాలుగా తిరగని రోజు లేదు. కలవని మంత్రి లేరు. మొక్కని దేవుడు లేడని తెలిపారు.

నంగునూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి రాష్ట్ర ఉపాధ్యక్షులు చెరకు దేవయ్య , క్రియాశీలక సిద్దిపేట్ జిల్లా సభ్యులు బాల్ లింగం, అశోక్, రేవంత్ మరియు రమణ చారి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1654 మంది గెస్ట్ లెక్చరర్లు MTS లోకి మారాలని మొక్కుకోవడం జరిగిందని తెలిపారు.

FOLLOW US @TELEGRAM & WHATSAPP

తాజా వార్తలు