గెస్ట్ లెక్చరర్ శీను నాయక్ కుటుంబానికి ఆర్దిక సహాయం చేసిన మధుసూదన్ రెడ్డి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ అచ్చంపేటకు చెందిన గెస్ట్ జూనియర్ లెక్చరర్ శీను నాయక్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఈ రోజు ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ పి. మధుసూదన్ రెడ్డి అధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ ల బృందం పరామర్శించారు. ఈ సందర్భంగా శీను నాయక్ కుటుంబానికి డా. పి. మధుసూదన్ రెడ్డి పదివేల ఆర్ధిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా ఇంటర్విద్యా జేఏసీ చైర్మైన్ డా. పి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ గెస్ట్ లెక్చరర్స్ రెన్యూవల్, పెండింగ్ జీతాలు సమస్యలపై ప్రభుత్వంతో చర్చించి ఖచ్చితంగా త్వరలోనే పరిష్కారిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ పి. మధుసూదన్ రెడ్డి, కళింగ కృష్ణ కుమార్, మాధవరావు గెస్టు లెక్చరర్స్ ప్రెసిడెంట్ యాకూబ్ పాషా, సదానందం గౌడు, కనకరాజ్, రాంబాబు, వేణు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.