గెస్ట్ లెక్చరర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి

  • ఆత్మహత్యలు పరిష్కారం కాదు.. గెస్ట్ లెక్చరర్లు సంయమనం పాటించాలి
  • ఆత్మహత్యాయత్నం చేసుకున్న శ్రీనివాస్ ను పరామర్శించిన ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, గెస్ట్ లెక్చరర్ల సంఘం
  • ఆర్థిక సహాయం అందజేసి కుటుంబసభ్యులకు అండగా నిలిచిన సంఘం నాయకులు

గెస్ట్ జూనియర్ లెక్చరర్ల సమస్యలపై ఇంటర్ బోర్డు, ప్రభుత్వం దృష్టి సారించి పరిష్కారం చేలి 1600 కుటుంబాలను ఆదుకోవాలని ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, గెస్ట్ లెక్చరర్ల సంఘం 2152 నేతలు డిమాండ్ చేశారు..ఈ క్రమంలో హైద్రాబాద్ ఉస్మానియా హాస్పిటల్ లో ఇటీవల ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మ హత్యా యత్నానికి పాల్పడిన గెస్ట్ లెక్చరర్ కాట్రావత్ శ్రీనివాస్ నాయక్ ను ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి, ఇంటర్ ప్రభుత్వ లెక్చరర్స్ అసోసియేషన్ భాద్యులు ఎం. జంగయ్య ఆధ్వర్యంలో 2152 సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, నాయకులు ఇస్సాక్, యుగేందర్ లు పరామర్శించి కుటుంబ సభ్యులకు ఓదార్పు అందించడం జరిగింది.

హాస్పిటల్ లో శ్రీనివాస్ యొక్క ఆరోగ్య స్థితిని తెలుసుకోవడం జరిగింది. కుటుంబ సభ్యులతో.. జంగయ్య మరియు గెస్ట్ లెక్చరర్ ల సంఘ నాయకులు మాట్లాడి, ధైర్యంగా ఉండాలని ఓదార్చి 2152 సంఘం, TIGLA, TIPS సంఘాల తరపున ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

గెస్ట్ లెక్చరర్లు సంయమనంతో ఉండాలని, సమస్యలు త్వరలోనే పరిష్కారం అవుతాయని, తొందరపాటు చర్యల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదని TIGLA, TIPS 2152 సంఘాల నాయకులు సూచించారు.