గెస్ట్ లెక్చరర్ల మూడు నెలల పెండింగ్ వేతనాల బడ్జెట్ విడుదల పట్ల హర్షం – దామెర, దార్ల

  • మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, కమీషనర్ జలీల్ గారికి TIGLA, TIPS సంఘాల భాధ్యులకు కృతజ్ఞతలు
  • 2152 గెస్ట్ లెక్చరర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్

తెలంగాణ రాష్ట్రంలోనున్న 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరంలో పనిచేసిన గెస్ట్ లెక్చరర్లకు సంబందించిన మూడు నెలల పెండింగ్ వేతనాల బడ్జెట్ రూ. 9 కోట్ల 51 లక్షల 26 వేలు విడుదల చేస్తూ… ఉత్తర్వులు ఇవ్వడం పట్లగెస్ట్ లెక్చరర్ల సంఘం 2152 రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు హర్షం వ్యక్తం చేశారు.

2152 సంఘం తరపున నిర్విరామంగా పలుమార్లు చేసిన విజ్ఞప్తులను దృష్టిలో పెట్టుకుని ఉత్తర్వులు విడుదల చేసినందుకు గానూ.. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు, కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్, ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా లకు మరియు గెస్ట్ లెక్చరర్ల పెండింగ్ వేతనాల సమస్య పలుమార్లు సంబందిత అధికారుల, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వుల విడుదలకు సహకరించిన ఇంటర్ విద్యా పరిరక్షణ సమితి భాద్యులు, తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం. జంగయ్య, ఎం. రామకృష్ణ గౌడ్ లకు ఇంటర్ విద్యలోనున్న వివిధ సంఘాల నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వీలైనంత త్వరగా ఈ విద్యా సంవత్సరానికి కూడా కొనసాగింపు ఉత్తర్వులు ఇచ్చి 1600 మంది గెస్ట్ లెక్చరర్ ల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.