హుస్నాబాద్ (AUG. 07) : guest lecturers meet minister ponnam prabhakar. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేసే సిద్దిపేట జిల్లా గెస్ట్ లెక్చరర్లు రోడ్డు రవాణా శాఖ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారిని హుస్నాబాద్ లో మంత్రి క్యాంప్ ఆఫీస్ లో కలిసి గెస్ట్ లెక్చరుల సమస్య పైన వినతిపత్రం ఇచ్చారు
ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి… కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా మరియు ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ కి ఆదేశాలు జారీ చేసే విధంగా మీకు న్యాయం చేయిస్తాను అని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గెస్ట్ లెక్చరర్ల రాష్ట్ర ఉపాధ్యక్షుడు సిహెచ్ దేవయ్య, సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు మల్లికార్జున్ మరియు సభ్యులు సంపత్, రేవంత్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.