BIKKI NEWS (JUNE 20) : Guest lecturers meet chief VIP AADI SRINIVAS. మేడిపల్లి మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీను గారికి గెస్ట్ లెక్చరర్లు తమ సమస్యల గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
Guest lecturers meet chief VIP Aadi Srinivas.
నాలుగు నెలలుగా వేతనాలు లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తూ కళాశాల అభివృద్ధి కొరకు పాటుపడుతున్న అతిధి ఆధ్యాపకుల వేతనాలను మంజూరు చేయాలని అదేవిధంగా గవర్నమెంట్ జూనియర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ ద్వారా డిస్టర్బ్ అయిన గెస్ట్ లెక్చరర్ అందర్నీ తిరిగి మళ్లీ విధుల్లోకి తీసుకునే విధంగా అడ్జస్ట్మెంట్ చేయాలని వినతిపత్రంలో పేర్కొనడం జరిగింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా గెస్ట్ లెక్చరర్స్ సాలరీ 42,000/ రూపాయలకు పెంపు మరియు మా యొక్క సర్వీసులను MTS గా మార్చమని ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుర్రాల సాయి కృష్ణ మరియు సభ్యులు అరుణ్ రాంబాబు లక్ష్మణ్ జ్ఞానేశ్వర్లు పాల్గొన్నారు
- FREE ONLINE TEST LINKS – ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
- TEACHERS – టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ హాజరు
- AP JOBS – కర్నూలు జిల్లాలో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ జాబ్స్
- PM MODI – నరేంద్ర మోదీ కి నమీబియా అత్యున్నత పురష్కారం
- NEET STATE RANKS – త్వరలోనే నీట్ స్టేట్ ర్యాంక్స్