ఎమ్మెల్సీ పల్లా దృష్టికి అతిధి అధ్యాపకుల సమస్యలు – 2152 సంఘం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న అతిధి అధ్యాపకుల సంఘం (2152) రాష్ట్ర అద్యక్షులు దామెర ప్రభాకర్ , ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ ల ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ డా,, పల్లా రాజేశ్వర్ రెడ్డిని హైద్రాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిసి.. ఒప్పంద అధ్యాపకుల సమస్యలకు సంబంధించిన వినతిపత్రం అందించడం జరిగింది

గత విద్యాసంవత్సరం పనిచేసిన 3 నెలలకు ఇంతవరకు వేతనాలు ఇవ్వలేదని, గత విద్యాసంవత్సరం ఆన్లైన్ క్లాసులలో గెస్ట్ లెక్చరర్ల సేవలను ఉపయోగించుకుని, ఈసారి ఆన్లైన్ క్లాసులు ప్రారంభం ఐనా..అడ్మిషన్లు జరుగుతున్న కీలక సమయంలో గెస్ట్ లెక్చరర్ల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గెస్ట్ లెక్చరర్లంతా ఆందోళన చెందుతున్నారని విన్నవించినట్లు తెలిపారు.

పల్లా స్పందిస్తూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సెక్రటరీ రోనాల్డ్ రాస్ తో మాట్లాడుతూ..మన ఫైల్ వివరాల గూర్చి..అడగగా ఇప్పటికే పలు మార్లు ఇంటర్మీడియట్ సెక్రటరీ ప్రతిపాదనలు పంపినా.. ప్రభుత్వ అనుమతికి సంబందించిన రాటిఫికేషన్ (ముందస్తు ప్రతిపాదనలు)సరిగా లేనందున ఆలస్యం అవుతుందని.. దీని ఆమోదం కోసం ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అయినందున.. ప్రభుత్వ అనుమతి కోసం ఫైల్ పంపనున్నట్లు తెలిపారు. అదేవిధంగా.. ఈ విద్యాసంవత్సరం గెస్ట్ లెక్చరర్ల బడ్జెట్ త్వరగా విడుదల చేయాలని కోరారు.

ఆ తర్వాత..ఇప్పటికే ప్రారంభం ఐన ఆన్లైన్ తరగతులలో మన సేవలను కొనసాగింపు గూర్చి..స్పందిస్తూ తప్పకుండా పాత వారి సేవలను తీసుకుంటేనే కళాశాలలకు, విద్యార్థులకు శ్రేయస్కరమని తెలిపారు. ఈ విషయంపై విద్యాశాఖ మంత్రి వ్యక్తిగత కార్యదర్శితో మాట్లాడి.. సానుకూల నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా మంత్రికి వ్యక్తిగతంగా ఈ విషయాన్ని గుర్తు చేస్తానని, మీరు కూడా వెళ్లి కలవాలని మనకు సూచించారు.

ఈ క్రమంలో ఇటీవల పల్లా పుట్టినరోజు న 2152 సంఘం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతం చేసిన తెలియజేసి..కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలన్నీ ఒక ఫ్రేమ్ చేసి కానుకగా అందజేసి కృతజ్ఞతలు తెలిపి 2152 సంఘం కార్యవర్గాన్ని, పాల్గొన్న సభ్యులందరినీ అభినందించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహేష్ కుమార్, బాబురావు, వెంకటేష్, కృష్ణ, యుగేందర్, రామచంద్రు, బాలరాజు, నరసింహారావు, రాము తదితరులు పాల్గొన్నారు.