Home > EMPLOYEES NEWS > గెస్ట్ లెక్చరర్ల ను MTS ఉద్యోగులుగా గుర్తించాలి – సీఎం, మంత్రులకు వినతి

గెస్ట్ లెక్చరర్ల ను MTS ఉద్యోగులుగా గుర్తించాలి – సీఎం, మంత్రులకు వినతి

BIKKI NEWS (FEB. 26) : ఆదివారం రోజున సిద్దిపేట్ టిపిసిసి నెంబర్ ధర్పల్లి చంద్రన్న ఆధ్వర్యంలో స్టేట్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దామర ప్రభాకర్, అసోసియేట్ ప్రెసిడెంట్ మహేష స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ దేవయ్య మరియు సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్ విజయ్, వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ల సమక్షంలో సిద్దిపేట గెస్ట్ లెక్చర్స్15 మంది హైదరాబాదు నుండి 25 మంది తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి నివాసంలో ముఖ్యమంత్రి సూచనల మేరకు ముఖ్యమంత్రి పిఏ ను కలిసి గెస్ట్ లెక్చరర్స్ సమస్యలు వివరిస్తూ 10 సంవత్సరాలుగా పేద విద్యార్థులకు సర్వీస్ అందిస్తున్న తమను మినిమం టైం స్కేల్ MTS ల కల్పించాలని వివరిస్తూ రెప్రజెంటేషన్ కాపీ అందించడమైనది ఒక ప్రకటనలో తెలిపారు..

వారు సానుకూలంగా స్పందిస్తూ రిప్రజెంటేషన్ కాపీ తీసుకుని ఈ కాపీని సంబంధిత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ పంపిస్తామని తెలియజేశారని తెలిపారు

తదనంతరం రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ క్యాలెండర్ 2024 ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు. తదనంతరం గెస్ట్ లెక్చరర్స్ 10 సంవత్సరాలుగా సర్వీస్ అందిస్తున్న మమ్మల్ని MTS ఉద్యోగులుగా మార్చాలని కోరనైనది. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి మీ సమస్య మా దృష్టిలో ఉందని, త్వరలోనే క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలియజేశారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా నుండి స్వాతి మేడం, బాల సిద్ధయ్య, ఉజ్మాసనోడా, అశోక్, శ్రీనివాస్,న జీర్ కార్తీక్ తదితరులు మరియు హైదరాబాద్ జిల్లా నుండి సుమారు 25 మంది పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయడం జరిగింది, పాల్గొన్న ప్రతి సభ్యునికి సిద్దిపేట జిల్లా అసోసియేషన్ తరపున కృతజ్ఞతలు తెలియజేయడమైనది.