జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్లకు “ఉద్యోగ భద్రత” కల్పించాలి

  • కాంగ్రేస్ పార్టీ మేనిఫెస్టో మంత్రుల హామీ మేరకు “మినిమం టైం స్కేల్” వర్తింపజేయాలి.
  • నూతన జూనియర్ లెక్చరర్ల నియామకంతో సంబందం లేకుండా ప్రస్తుతం పనిచేస్తున్న లెక్చరర్లనే కొనసాగించాలి
  • గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ 33 జిల్లాల ఇంచార్జుల నియమాకం
  • ఇంచార్జులు బాధ్యతతో గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారంకై నిబద్ధతతో పనిచేయాలి
  • గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్

BIKKI NEWS (JAN. 24) : Guest lecturers demanding for job security . తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో గత 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు “ఉద్యోగ భద్రత” కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వ జూనియర్ కాలేజెస్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అద్యక్షుడు దామెర ప్రభాకర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్ లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

Guest lecturers demanding for job security

అదే విధగా ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ద్వారా 1300 కు పైగా రెగ్యూలర్ లెక్చరర్ల నియామకంతో సంబందం లేకుండా ప్రస్తుతం పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లందరినీ యధావిధిగా కొనసాగించాలని, కాంగ్రేస్ పార్టీ మేనిఫెస్టో, ముఖ్యమంత్రి, ప్రస్తుత మంత్రులు పలు సందర్బాలలో ఇచ్చిన హామీల మేరకు గెస్ట్ లెక్చరర్లను “మినిమం టైం స్కేల్ ” వర్తింపజేసి “ఉద్యోగ భద్రత” కల్పించి దాదాపు 1700 కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ ఆద్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలకు ఇంచార్జులను నియమించామని ఈ సందర్భంగా తెలిపారు.

ఉమ్మడి మహబూబ్ నగర్ నుండి.. డి.నరేష్, ఆర్.సంగీత, జి.యుగంధర్, కె. అనురాధ, కే. శ్రీను, టి.స్వర్ణలత, కే.అరవిందాచారి, ఎన్.రాఘవేంద్ర,

ఉమ్మడి ఆదిలాబాద్ నుండి.. ఎం.స్వామి, జి.అశోక్, ఎం.డీ అఫ్జల్, పి.ఉదయశ్రీ, ఎస్.బానేష్, సీహేచ్.సుమలత, ఎస్.ముత్యం, ఎం.సాయన్న,

ఉమ్మడి వరంగల్ నుండి.. వి.పవన్ కుమార్, ఎన్.రాధిక, హరిప్రసాద్, ఎన్.శ్రీనివాస్, వై.రాజు, సృజన, ఎ.శశిధర్, జి.స్రవంతి, ఎం.చిరంజీవి, ఎ.దేవేందర్,

ఉమ్మడి కరీనంగర్ నుండి.. జే.విజయ్, ఎ.రాజు, ఈ.అరుణ్ కుమార్, ఈ.సునంద, బి.స్వర్ణలత,

ఉమ్మడి నిజామాబాద్ నుండి.. పి.సాయికృష్ణ, జి.కైలాష్, ఎం.డీ ఇక్బాల్ అహ్మద్, కీర్తి ,

ఉమ్మడి మెదక్ నుండి.. ఎన్.శ్రీకాంత్ గౌడ్, బి.వందన, ఎం.శివకుమార్, టి.మల్లికార్జున్, కే.స్వాతి,

ఉమ్మడి నల్గొండ నుండి…జి. వెంకన్న, ఎస్. శ్రీధర్, డి. మమత, పి.మహేందర్, టి.హేమలత,

ఉమ్మడి రంగారెడ్డి నుండి.. డి.మహేందర్, జి. జంగయ్య, ఎం.డీ నయీముద్దీన్, కే.వెంకయ్య, జి. అగస్టీన్ పాల్,

ఉమ్మడి ఖమ్మం నుండి.. కె.సతీష్ కుమార్, నాగశ్రీ, జి. రాధిక,

హైద్రాబాద్ నుండి.. సీహెచ్. బాలరాజు, పి.వెన్నెలా రెడ్డి, బి. రాంచందర్ లు నియమితులైనట్లు ప్రకటించారు.

నియమితులైన అన్ని జిల్లాల ఇంచార్జులు గెస్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికై వారి వారి జిల్లాలలో బాధ్యతగా పనిచేయడమే గాక రాష్ట్ర కమిటీ సూచనల మేరకు ముందుకు నడవాలని సూచించారు.

FOLLOW US

@FACEBOOK

@YOUTUBE

@WHATSAPP

@TELEGRAM

@INSTAGRAM

తాజా వార్తలు