BIKKI NEWS (NOV. 01) : guest lecturers 5 months pending salaries . ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,654 మంది మరియు జగిత్యాల జిల్లాలో ఉన్న గెస్ట్ జూనియర్ లెక్చరర్ లు ఐదు నెలలు జీతాలు లేకుండా పనిచేస్తున్న దాదాపు 60 మందిని ఆదుకోవాలని జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుర్రాల సాయి కృష్ణ ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా ఇంకా జీతాలు అందుకోకుండా చాలా కష్టాలు అనుభవిస్తున్న అతిథి అధ్యాపకులను ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నామని కోరారు.
ఈ సంవత్సరం ఏప్రిల్, మేలో ఎటువంటి జీతాలు రాకుండా ప్రభుత్వ జూనియర్ కళాశాల బలోపేతానికై విద్యార్థులను అడ్మిషన్ చేయడానికి దాదాపు ఒక నెల రోజుల వరకు ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రభుత్వ జూనియర్ కళాశాలల బలోపేతానికి మా వంతు కృషి చేయడం జరిగిందని, అయినప్పటికీ ఇప్పటివరకు మా వేతనాలపై ఎటువంటి స్పష్టత లేదని వాపోయారు.
గతంలో మా సమస్యల పరిష్కారానికి మంత్రివర్యులు శ్రీధర్ బాబుకి, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్మన్ కి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి చాలా సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగిందని, అయినప్పటికీ మా మీద ఎటువంటి ప్రభుత్వం దయ చూపకుండా ఆ వేతనాలు మంజూరు చేయలేదని తెలిపారు. ఈ ప్రభుత్వం వారి మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నెలకు 42000/- లతో 12 నెలల కన్సాలిడేటెడ్ పే ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి చాలా మార్లు తీసుకెళ్లడం జరిగిందని. ఇప్పటికైనా మా పై దయ తలచి మా యొక్క ఐదు నెలల వేతనాలను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని పేర్కొన్నారు.