గెస్ట్ లెక్చరర్ ఆత్మహత్య యత్నం.!

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తాలూకా కొండనాగుల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 4 సంవత్సరాలుగా కామర్స్ అతిథి అధ్యాపకుడిగా పని చేస్తున్న కాట్రావత్ శ్రీనివాస్ నాయక్ (31) ఉరి వేసుకొని ఆత్మహత్య యత్నం చేసుకున్నాడని గెస్ట్ లెక్చరర్ ల సంఘ నేతలు తెలిపారు.

అతడిని గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం అచ్చం పేట ఆసుపత్రికి తరలించగా… పరిస్థితి విషమంగా ఉందని హైదరాబాద్ కి పంపించాలని ఆసుపత్రి డాక్టర్ లు సూచించారని.. గెస్ట్ లెక్చరర్స్ కు పెండింగ్ జీతాలు , రెన్యువల్ రాకపోవడంతో ఆర్ధిక ఇబ్బందుల్లో ఆత్మ హత్యకు పాల్పడినట్లు తెలుస్తోందని సంఘ నేతలు తెలిపారు. శ్రీనివాస్ కు ముగ్గురు ఆడపిల్లలు సంతానం.. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని విషయాలూ తెలియాల్సి ఉంది.