BIKKI NEWS (AUG. 14) : Guest Junior Lecturers issue. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 10 సంవత్సరాలుగా పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ సమస్యలు పరిష్కరించాలని జగిత్యాల జిల్లా నోడల్ అధికారి గారికి గెస్ట్ లెక్చరర్ ల జిల్లా అధ్యక్షులు గుర్రాల సాయి కృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు ఆధ్వర్యంలో ఈరోజు వినతపత్రం ఇవ్వడం జరిగింది.
Guest Junior Lecturers issue
పూర్తి విద్యా సంవత్సరం పని చేసిన ఐదారు నెలలు జీతాలు
తీసుకోవడం జరుగుతుందని, రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కళాశాలలో 1,654 మంది పని చేస్తున్నారని, జగిత్యాల జిల్లాలోని 15 కళాశాలల్లో 56 మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైన గత మూడు నెలలుగా ఉచిత సేవలు అందిస్తూ జీతం రాక మరియు ఈ సంవత్సరం కొనసాగింపు రాక ఎన్నో కష్టాలు ఎదుర్కొని కళాశాలలకు రావడం జరుగుతుందని… కావున మా యొక్క విన్నపాన్ని ప్రభుత్వానికి తెలియజేసి తొందరగా మాకు న్యాయం జరిగే విధంగా విధంగా చేయగలరని వినతిపత్రం లో పేర్కొన్నారు.
ఈరోజు నుండి రాష్ట్ర కమిటీ సూచనల మేరకు కళాశాలకు విధులకు హాజరు కాకుండా మా యొక్క నిరసన తెలియజేయడం జరుగుతుంది మళ్లీ మమ్మల్ని కళాశాలకు రావడానికి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాతనే హాజరు కావడం జరుగుతుందని తెలిపారు.
ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 42,000 వేతనంతో 12 నెలలు ఇస్తామని చెప్పడం జరిగిందని… మంత్రులను మరియు అధికారులను ఎన్నిసార్లు కలిసినా మాపై చిన్న చూపు చూడడం జరుగుతుందని… ఈ విషయాన్ని మన ప్రభుత్వానికి అందజేసి మాకు సరైన న్యాయం చేయవలసిందిగా కోరుతున్నామని తెలిపారు.