సిద్దిపేట (సెప్టెంబర్ – 08) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్ లను ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా కొనసాగిస్తూ ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేసిన గెస్ట్ లెక్చర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు చెరుకు దేవయ్య, జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
1654 మంది గెస్ట్ లెక్చరర్స్ ని రెన్యువల్ చేస్తూ ఈరోజు కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకి, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్ర రెడ్డికి, ప్రిన్సిపల్ సెక్రెటరీ వాకాటి కరుణకి ,ఇంటర్ బోర్డు కమిషనర్ ఓమర్ జలీల్ కు ప్రత్యేక కృతజ్ఞతలు మరి ముఖ్యంగా ఈ రెన్యువల్ రావడానికి ప్రత్యేక చొరవ తీసుకున్న జీజేఎల్ ప్రెసిడెంట్ గౌరవ మధుసూదన్ రెడ్డికి కాంట్రాక్ట్ లెక్చరర్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ కనక చంద్రంలకు సిద్దిపేట జిల్లా గెస్ట్ లెక్చర్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలంపుతున్నట్లు సిద్దిపేట జిల్లా నాయకులు సిహెచ్ శ్రీనివాస్, జెల్ల విజయ్, మల్లికార్జున్, శ్రీనివాస్ తదితరులు పేర్కొన్నారు.
Follow Us @