గెస్ట్ లెక్చరర్లకు రెమ్యూనరేషన్ పెంపు పట్ల హర్షం : దామెర, దార్ల.

హైదరాబాద్ (జూలై – 29) : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత 8, 9 సంవత్సరాలుగా పని చేస్తున్న గెస్ట్ లెక్చరర్ల వేతనాలను పీఆర్సీ ప్రకారం 30% పెంచుతూ.. శుక్రవారం నాడు ఇంటర్మీడియట్ కమీషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల గెస్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు దామెర ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి దార్ల భాస్కర్, అసోసియేట్ ప్రెసిడెంట్ కోడి మహేష్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఎం బాబురావు, కోశాధికారి బండి కృష్ణ మరియు రాష్ట్ర కార్యవర్గం హర్షం వ్యక్తం చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా 1654 గెస్ట్ లెక్చరర్ లు పని చేస్తున్నారు. వీరికి ఒక్క పీరియడ్ కి 300 చొప్పున నెలకు 72 పీరియడ్ లకు 21600 కు మించకుండా ప్రభుత్వం వేతనం చెల్లించేది. ఇప్పుడు ప్రభుత్వం ఇంతముందు పీఆర్సీ పెంపుదల గెస్ట్ లెక్చరర్ లకు కూడా వర్తింప చేయడం తో పీరియడ్ కి 390 చొప్పున గరిష్టంగా 72 పీరియడ్ లకు 28080 రూపాయల కు పెంచుతున్నట్లు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇంటర్ బోర్డు కమీషనర్ అధికారికంగా ఉత్తర్వులు జారీ చేశారు..

ఇట్టి పెరుగుదల కు సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మాత్యులు సబితా ఇంద్రారెడ్డి, ఫైనాన్స్ సెక్రటరీ రోనాల్డ్ రాస్, ప్రిన్సిపాల్ సెక్రటరీ వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు సెక్రెటరీ సయ్యద్ ఉమర్ జలీల్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు.

Follow Us @