JOBS : 1,654 గెస్ట్ అధ్యాపక ఉద్యోగ నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్ (జూలై – 18) : తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి 1,654 గెస్ట్ జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ కోసం ఎంపిక ప్రక్రియ జులై 19 వ తారీఖున ప్రారంభం కానుంది.

జూలై 19న కళాశాల వారీగా, సబ్జెక్టుల వారీగా ఖాళీల వివరాలను జిల్లా పత్రిక ఎడిషన్ లలో DIEO/NODAL OFFICER లు ప్రకటనలు ఇవ్వాలి.

జూలై – 24 తో దరఖాస్తు గడువు ముగుస్తుంది.

జూలై – 26 వరకు దరఖాస్తులను DIEO/NODAL OFFICER పరీశీలన పూర్తి చేయాలి

జూలై – 27 సబ్జెక్ట్ వారీగా, జిల్లా వారీగా మెరిట్ లిస్ట్ ను DIEO/NODAL OFFICER లు సెలక్షన్ కమిటీ కి అప్పగించాలి.

జూలై – 28న జిల్లా కలెక్టర్ ఎంపిక కాబడిన అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు.

ఆగస్టు – 01 న ఎంపికైన అభ్యర్థులు సంబంధించిన కళాశాల ప్రిన్సిపాల్ కు రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకుంటే ఎంపిక రద్దు కాబడుతుంది.

అభ్యర్థులు జిల్లా ఇంటర్మీడియట్ DIEO/NODAL OFFICERS కి దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.