GUEST JUNIOR LECTURER JOBS : నల్గొండ జిల్లా నోటిఫికేషన్

నల్గొండ (జూలై – 19) : తెలంగాణ ఇంటర్మీడియట్ కమీషనర్ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను అతిధి అధ్యాపకుల చేత భర్తీ చేయడానికి జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.

మొత్తం 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వివిధ సబ్జెక్టులలో 53 పోస్టులను భర్తీ చేయడానికి ప్రకటన విడుదల చేశారు.

పీజీ‌ అర్హత (50% మార్కులు) కలిగిన అభ్యర్థులు నల్గోండ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికా‌రి కార్యాలయం, నల్గోండ యందు జూలై 24 సాయంత్రం 5.00 గంటల లోపల దరఖాస్తు చేసుకోగలరు.

పీజీ లో సాదించిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఎంపికైన అభ్యర్థులు సంబంధించిన కళాశాలలో ఆగస్టు 01 – 2023 న రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

Comments are closed.