జగిత్యాల ఇంటర్ విద్యా అధికారిని సన్మానించిన గెస్ట్ లెక్చరర్స్

జగిత్యాల : జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులు ఈరోజు ఇంటర్ విద్య నోడల్ అధికారి బి. నారాయణను శాలువాతో సన్మానించారు.

ఈ విద్యా సంవత్సరం విధుల్లోకి తీసుకోవడంలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం పట్ల కృతజ్ఞతగా ఈ సన్మానం చేసినట్లు సంఘ అధ్యక్షుడు గుర్రాల సాయి కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

అలాగే గత విద్యా సంవత్సరం ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ మాసాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న వేతనాలను త్వరగా వచ్చేలా చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయగా వీలైనంత త్వరగా వేతనాల చెల్లింపుకు కృషి చేస్తానని నోడల్ అధికారి హమీ ఇచ్చారని అని సంఘ ప్రతినిధులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అతిథి అధ్యాపకుల జగిత్యాల జిల్లా అధ్యక్షుడు గుర్రాల సాయికృష్ణ, రమేష్, శంకరయ్య, ప్రవీణ్, శీరీష, లాలిత్య, ఇప్తేకర్, లతీఫ్, రాము, గణేష్ లు పాల్గొన్నారు.

Follow Us @