పల్లా కి సంపూర్ణ మద్దతు – ప్రభుత్వ జూనియర్ కళాశాలల అతిథి అధ్యాపకుల సంఘం (1145)

తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు అతి కీలకమైన ఇంటర్ విద్యలో ఉద్యోగుల పాత్ర మీద ఈ రోజు ఖమ్మంలో “ఇంటర్ విద్య – ఉద్యోగుల దిశా నిర్దేశం సమ్మేళనము” ఇంటర్ విద్య జేఏసీ నేత మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి హాజరవడం జరిగింది.

ఈ సమావేశంలో అతిథి అధ్యాపకుల సంఘం అధ్యక్షులు యస్.కే. యాకుబ్ పాషా మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. అతిథి అధ్యాపకుల సమస్యలు పరిష్కారం కావాలంటే మన సమస్యలను ప్రశ్నించే, పరిష్కరించే గొంతుక అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి చట్టసభల్లో ఉండాలని ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇంటర్ విద్య అబివృద్దికి ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని ఉచిత విద్య అందిస్తుందని తెలుపుతూ… ఉద్యోగులకు కూడా సంపూర్ణ న్యాయం చేస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులను విద్యా సంవత్సరం ఆలస్యం అయినప్పటికి కొనసాగిస్తున్నట్లుగా, పెండింగ్ లో వేతనాల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, నెల నెల వేతనం ఇప్పించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఇంటర్ విద్యా జేఏసీ నేత మధుసూదన్ రెడ్డి, అతిధి అధ్యాపకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకుబ్ పాషా, ఉపేంద్ర చారి, కీర్తి మరియు ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల అధ్యక్షులు కార్యదర్శులు కోశాఖాధికారులు మరియు అతిథి అధ్యాపకులు పాల్గొన్నారు.

Follow Us@