జీవనోపాధి కల్పించిన ప్రభుత్వానికి అండగా ఉండాలి – 1145 రాష్ట్ర అధ్యక్షులు

రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో సంబంధించిన జిల్లాల అతిథి అధ్యాపక మిత్రులు అతిథి అధ్యాపకుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని హరీష్ రావు నాయకత్వంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీమతి పివి వాణిని మరియు పల్లా రాజేశ్వర రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రి హరీష్ రావుకి గిఫ్ట్ గా ఇవ్వాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి అని 1145 సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్. యాకుబ్ పాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వము రాగానే అతిథి అధ్యాపకుల నాన్ సాంక్షన్ పోస్టులను సాంక్షన్ చేయడం జరిగింది. వేతనం పది వేల నుండి 21,600 పెంచడం జరిగింది. త్వరలో నెలనెలా వేతనాలు వస్తాయని ఆర్థిక శాఖ మంత్రి గారు స్పందించి హైదరాబాద్ సభా ప్రాంగణంలో తెలియజేశారు.

కావునా అతిథి అధ్యాపకుల ప్రయోజనాలు గురించి ఆలోచించే వారికి మాత్రమే ఓటు వెయ్యాలి ప్రశ్నించే వారికి వేస్తే ప్రశ్నగానే మారుతుంది. కరోనా సమయంలో అతిథి అధ్యాపకులకు రెన్యువల్ వస్తుందా లేదా అని అయోమయంలో ఉన్నాము. ఇలాంటి కష్టకాలంలో కూడా మనకు రెన్యువల్ చేసి మనకు అండగా నిలిచింది ప్రభుత్వం. ఇలాంటి సమయంలోనే మన ప్రభుత్వానికి అండగా ఉండాలి మనకు ప్రభుత్వం అండగా ఉంటుంది అని 1145 సంఘం రాష్ట్ర అధ్యక్షులు యాకుబ్ పాషా తెలిపారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు

Follow Us@