29న అతిథి అధ్యాపకుల శాంతియుత మౌనదీక్ష

తెలంగాణ రాష్ట్రం లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న పార్ట్ టైం అతిధి అధ్యాపకులను రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ చలో హైదరాబాద్ కార్యక్రమంలో బాగంగా “తెలంగాణ ప్రభుత్వ పార్ట్ టైం గెస్ట్ లెక్చరర్ ల గోస – గోడు” పేరుతో శాంతియుత మౌన దీక్షను నాంపల్లిలోని తెలంగాణ ఇంటర్మీడియట్ కమిషనరేట్ ఆవరణలో డిసెంబర్ 29 మంగళవారం నాడు చేయనున్నట్లు యాకుబ్ పాషా తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 1500 మంది అతిథి అధ్యాపకులు ఈ శాంతియుత మౌన దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి తమ సమస్య తీవ్రతను చాటి చెప్పాలని అధ్యక్షుడు యాకుబ్ పాషా పిలుపునిచ్చారు.

ఈ గోస – గోడు కార్యక్రమం యొక్క ప్రధాన డిమాండ్లు

  • విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకులను వెంటనే రెన్యూవల్ చేయడం
  • సమాన పనికి సమాన వేతనం
  • కన్సాలిడేటెడ్ పేమెంట్
  • ఉద్యోగ భద్రత

వంటి అంశాలతో ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి పిలుపునిచ్చినట్లు ఒక ప్రకటనలో తెలిపారు అలాగే ఈ కార్యక్రమంలో వందలాది అతిథి అధ్యాపకులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

Follow Us@