అధికారుల దృష్టికి అతిథి అధ్యాపకుల సమస్యలు – యాకుబ్ పాషా

అతిథి జూనియర్ అధ్యాపకుల సంఘం (1145) గౌరవ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సూచన మేరకు రాష్ట్ర అధ్యక్షులు యాకుబ్ పాషా ఆధ్వర్యంలో ఉన్నత విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని మరియు ఇంటర్మీడియట్ విద్యా కమీషనర్ ని కలిసి గత విద్యా సంవత్సరంలో అతిధి అధ్యాపకులు పని చేసిన మూడు నెలల పెండింగ్ వేతనాలను మరియు ఈ విద్యా సంవత్సరానికి గాను రెన్యూవల్ అంశం పై వినతిపత్రాలు అందించడం జరిగింది.

ఈ నేపథ్యంలో అధికారులు స్పందిస్తూ జూలై నెల చివరి వరకు 3 నెలల పెండింగ్ వేతనాలు మరియు రెన్యూవల్ అంశంపై స్పష్టత వస్తుందని తెలియజేశారని సంఘ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు.

అధికారులను కలిసిన వారిలో కనకరాజు, రాజశేఖర్, మాధవి,ళశ్రీధరాచారి, తిరుపతి, కీర్తి, రాజేంద్ర ప్రసాద్, రాంప్రసాద్, బాలకృష్ణ, నారాయణ రెడ్డి, ఆంజనేయులు తదితరులు ఉన్నారు.