వరంగల్ రూరల్ జిల్లా డీఐఈవో కి అతిథి అధ్యాపకుల సన్మానం.

వరంగల్ రూరల్ జిల్లా DIEO జితేందర్ రెడ్డికి ఈ రోజు అతిథి అధ్యాపకుల సంఘం (1145) రాష్ట్రా అసోసియేట్ అధ్యక్షుడు బిక్షూ నాయక్ నేతృత్వంలో అతిథి అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపి చిరు సన్మానం చేశారు.

ఈ సందర్భంగా బిక్షూ నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత సంవత్సరం పని చేసిన గెస్ట్ ఫ్యాకల్టీ రెన్యూవల్ అయినా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి, ఇంటర్మీడయట్ కమిషనర్కి, గౌరవ అధ్యక్షుడు మధుసూధన్ రెడ్డికి, సహకరించిన DIEO లందరికీ 1500 కుటుంబాల తరుపున అభివాదం తెలియ చేస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ రూరల్ జిల్లా అధ్యక్షులు మలిఖార్జున్, హరి బాబూ, సంతోష్, భవాని సాగర్, రాధిక, ఝాన్సి, తదితరులు పాల్గొనడం జరిగింది

Follow Us@