రెన్యూవల్ కోసం అతిధి అధ్యాపకులు చేస్తున్న మౌన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.

తెలంగాణ రాష్ట్రం లోని 404 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పని చేస్తున్న దాదాపు 1500 మంది అతిథి అధ్యాపకులను వెంటనే రెన్యువల్ చేయాలని కోరుతూ ఈరోజు ఉదయం నాంపల్లిలోని ఇంటర్ మీడియట్ కమిషనరేట్ ఆవరణలో అతిథి అధ్యాపకులు తలపెట్టిన శాంతియుత మౌనదీక్ష కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు.

జిల్లాల నుండి వందలాదిగా తరలివచ్చిన అతిధి అధ్యాపకులను పోలీసులు అడ్డుకొని కార్యక్రమాలకు అనుమతి లేదని బేగం బజార్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే అంతకు ముందు అతిథి అధ్యాపకులు ఇంటర్ విద్య కమిషనర్ ఉమర్ జలీల్ ను కలిసి తమ సమస్యలను వివరిస్తూ వినతిపత్రం అందజేయడం జరిగింది.

సంఘ అధ్యక్షుడు యాకుబ్ పాషా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 45 ప్రకారం ఇంటర్మీడియట్ వ్యవస్థలో ఇతర తాత్కాలిక ఉద్యోగులను రెన్యూవల్ చేసినపట్లే తమను కూడా జూన్ ఒకటి నుంచి రెన్యూవల్ చేయాలని తాము అడ్మిషన్లు, ఆన్లైన్ తరగతుల యందు పాల్గోంటున్నామని తమ సేవలను గుర్తించాలని, 1500 కుటుంబాలను ఆదుకోవాలని సీఎం కేసీఆర్ ను వేడుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు యాకూబ్ పాషా, ప్రధాన కార్యదర్శి రాజ్ కుమార్ మరియు కనకరాజు, మధుసూదన్ రెడ్డి, ఉపేంద్ర చారి, రాజశేఖర్, రామ్ ప్రసాద్ మరియు వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన అతిధి అధ్యాపకులు పాల్గొన్నారు.

Follow Us@