GUEST JOBS : డిగ్రీ అతిథి అధ్యాపకులకై దరఖాస్తులు

కరీంనగర్ (జూలై – 02) : మహాత్మ జ్యోతిబాపూలే తెలంగాణ బిసి సంక్షేమ డిగ్రీ కళాశాలలు జగిత్యాల జిల్లాలోని ధర్మపురి (పురుష), ఎల్లారెడ్డిపేట (పురుషు), పెద్దపెల్లి (మహిళా) కళాశాలలో విధులు నిర్వహించేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కరీంనగర్ ఆర్ సి వో గౌతమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలోతెలిపారు.

◆ ఖాళీల వివరాలు :
తెలుగు, ఇంగ్లీష్, పొలిటికల్ సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్, కామర్స్, హిస్టరీ, ఎకనామిక్స్, డాటా సెన్స్ మొదలగు సబ్జెక్టులు

◆ విద్యా అర్హతలు : 55% మార్కులతో మాస్టర్ డిగ్రీ, పిహెచ్డీ, ఎంపిల్, SLET, SET, NET, కలిగిన వారికి ప్రాధాన్యత

◆ ఎంపిక విధానం : అభ్యర్థులను మెరిట్, డెమో ఆధారంగా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

దరఖాస్తు గడువు :జూలై – 06 – 2023 లోపు పైన తెలిపిన కళాశాలలో అప్లై చేసుకోవాలి.

దరఖాస్తు : జిల్లాలోని ధర్మపురి సెల్ 8019429413, ఎల్లారెడ్డిపేట సెల్ 9908294365, పెద్దపల్లి సెల్ 9014466253 లలో పొందాలని సూచించారు.

ఇంటర్వ్యూ తేదీ : డెమో లేదా ఇంటర్వ్యూ తేదీ అభ్యర్థుల ఫోన్ నెంబర్లకు తెలియజేయనున్నారు.