GUEST JOBS : గురుకుల కళాశాలలో భర్తీకీ ప్రకటన

హైదరాబాద్ (జూలై – 29) : హైదరాబాద్ చైతన్యపురి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళ న్యాయ కళాశాలలో ఖాళీగా ఉన్న వివిధ అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ల నియామకానికి మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

ఈ పోస్టులను పూర్తిగా తాత్కాలిక “గెస్ట్” పద్ధతిలో నియామకం జరపనున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు కింద ఇవ్వబడును లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, సైకాలజీ, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ప్రాపర్టీ, కార్పోరేట్, క్రిమినల్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్, ఫ్యామిలీ లా వంటి అంశాలలో ఖాళీలు కలవు. పీజీ అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పి హెచ్ డి, నెట్, సెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వబడును.

మరిన్ని వివరాలకు 9603617134 నంబర్ లో సంప్రదించవచ్చు.

వెబ్సైట్ : [email protected]