హైదరాబాద్ (జూలై – 19) : ఖైరతాబాద్ లోని ప్రభుత్వ డిగ్రీ
కళాశాలలో అతిథి అధ్యాపకుల (Guest Faculty Jobs in govt degree colleges) నియామకాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాజేంద్రకుమార్ ప్రకటనలో పేర్కొన్నారు. 2023-24 విద్యా సంవత్సరానికి 27 మంది అతిథి అధ్యాపక పోస్టులు భర్తీ చేయనున్నారు.
◆ ఖాళీల వివరాలు :
ఇంగ్లీష్ 4,
సంస్కృతం 2,
వాణిజ్య శాస్త్రం (కామర్స్) 3, బీబీఏ 3,
డాటా సైన్స్ 1,
గణితం 1,
స్టాటిటిక్స్ 2,
అప్లైడ్ న్యూట్రిషన్ 1,
అరబిక్ 1,
కంప్యూటర్ సైన్స్ 8,
ట్యాక్సేషన్ 1
◆ అర్హతలు : పీజీ సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నెట్, సెట్ లేదా పీహెచ్డీ అర్హత ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
◆ దరఖాస్తు విధానం : ప్రత్యక్షంగా
◆ దరఖాస్తు గడువు : జులై 22వ తేదీలోపు కళాశాలలో
అందజేయాలి.
◆ డెమో/ఇంటర్వ్యూ తేదీ : జులై 25న