మెదక్ (జూలై – 19) : స్థానిక మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 14, నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 మొత్తం 23 ఖాళీలను అతిధి అధ్యాపకుల చేత భర్తీ (guest faculty recruitment in medak and narsapur degree colleges 2023) చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ గణపతి తెలిపారు.
మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు -3, ఇంగ్లీష్ – 3, కంప్యూటర్ సైన్స్ – 4, మరియు కామర్స్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ విభాగాలలో ఒక్కొక్క పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
అలాగే నర్సాపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ – 2, జువాలజీ, కంప్యూటర్ సైన్స్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, ఇంగ్లీష్, తెలుగు సబ్జెక్టులలో ఒక్కొక్క పోస్ట్ ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.
ఇందుకుగాను ఆయా సబ్జెక్టుల పీజీ లో 55% మార్కులు కలిగి ఉండాలి మరియు పి హెచ్ డి లేదా నెట్ /సెట్ గలవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
మెదక్ మరియు నర్సాపూర్ కళాశాలకు సంబంధించిన దరఖాస్తులు అన్నింటిని మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అన్ని జిరాక్స్ ప్రతులను జతపరుస్తూ శనివారం 22వ తేదీలోగా అందజేయాలని సూచించారు.
తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో మంగళవారం 25వ తేదీ నాడు డెమో మరియు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ప్రిన్సిపాల్ గణపతి సూచించారు.