గెస్ట్ లెక్చరర్ లు 61 సంవత్సరాల వరకు పనిచేయవచ్చు

  • ఇంటర్మీడియట్ కమీషనరేట్ కీలక నిర్ణయం
  • తమను కొనసాగించలంటున్న కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేసే అతిథి అధ్యాపకులు 61 సంవత్సరాల వరకు పనిచేయవచ్చని ఇంటర్ విద్యాశాఖ కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో తాత్కాలిక పద్దతిలో పని చేసే లెక్చరర్ లు 58 సంవత్సరాల పైబడితే విధుల నుండి తొలగించాలని, వేతనాలు నిలిపివేయాలని ఇచ్చిన ఉత్తర్వులకు సవరణగా ఈ ఉత్తర్వులు జారీచేశారు.

విద్యార్థులను తరగతి గదులలో ఖాళీగా కూర్చోబెట్టలేమని అందుకే 61 సంవత్సరాల వరకు గెస్ట్ లెక్చరర్ ల సేవలు కొనసాగిస్తున్నట్లుగా పేర్కొన్నారు.

అయితే కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ లు కూడా తమ సర్వీస్ ను 61 సంవత్సరాల వరకు పొడిగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. గత 22 ఏళ్ళుగా సేవలందిస్తున్న తమ సర్వీస్ ను గుర్తించి రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా రిటైర్మెంట్ వయోపరిమితి ని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ ల సంఘాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.

Follow Us @