కాంట్రాక్టు అధ్యాపకులు వస్తే అతిధి అధ్యాపకులు తప్పుకోవాల్సిందే.

తెలంగాణలోని డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న బోధన సిబ్బందిని హవర్లీ బెసీస్ పద్ధతిలో గెస్ట్ అధ్యాపకులను నియమించుకోవడం కోసం ఉత్తర్వులు కాలెజీయోట్ ఎడ్యుకేషన్ విడుదల చేసింది.

ఈ అతిథి అధ్యాపకుల నియామక ప్రోసిడింగ్ లో అతిథి అధ్యాపకులు నియమించబడిన స్థానాల్లోకి భవిష్యత్తులో రెగ్యులర్ లేదా కాంట్రాక్టు అధ్యాపకులు వచ్చినప్పుడు వారు తప్పుకోవాలని స్పష్టంగా పేర్కొనడం జరిగింది.

ఈ నిబంధన ప్రకారం అతిథి అధ్యాపకుడు పని చేస్తున్న స్థానానికి రెగ్యులర్ లేదా కాంట్రాక్టు అధ్యాపకుడు పదోన్నతులతో కానీ, బదిలీల మీద కానీ వచ్చినప్పుడు ఆ స్థానంలో పని చేస్తున్న అతిథి అధ్యాపకుడిని తొలగించి రెగ్యులర్ లేదా కాంట్రాక్టు అధ్యాపకుడికి పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

Follow Us @