GTvsMI : ఫైనలిస్ట్ ఎవరు.?

అహ్మదాబాద్ (మే – 26) : IPL – 2023 లో భాగంగా ఈరోజు క్వాలిఫైయర్ – 2 (QUALIFIER – 2 MIvsGT) లో గుజరాత్ టైటాన్స్ – ముంబై ఇండియన్స్ జట్లు పోటీ పడుతున్నాయి.

టేబుల్ టాపర్ అయినా గుజరాత్ క్వాలిఫైయర్ – 1 లో చెన్నై జట్టు మీద ఓడిపోయి క్వాలిఫయర్ – 2 తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

అలాగే ఎలిమినేటర్‌ లో లక్నో సూపర్ జెంట్స్ మీద ముంబై ఇండియన్స్ ఘన విజయం సాధించి క్వాలీపయర్ – 2కి చేరింది.

ఈరోజు క్వాలిఫయర్ – 2 లో గెలిచిన జట్టు మే 28న జరిగే ఐపీఎల్ 2023 ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడనుంది.

వర్షం కారణంగా మ్యాచ్ రద్దు అయితే ఎలాంటి రిజర్వ్ డే లేదు. ఈ నేపథ్యంలో టేబుల్ టాపర్ అయినా గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్ చేరుతుంది.