RCBvsGT : ఓటమితో ఇంటిముఖం పట్టిన బెంగళూరు

బెంగళూరు (మే – 21) : ఐపీఎల్ లో చివరి లీగ్ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓటమి పాలై ప్లేఆఫ్స్ కు చేరలేకపోయింది. ముంబై ప్లేఆఫ్స్ కు చేరింది. విరాట్ కోహ్లీ సెంచరీ వృథా అయింది. శుభమన్ గిల్ సెంచరీ (104*) తో మ్యాచ్ గెలిపించాడు. ఈ ఐపీఎల్ లో గిల్ కు ఇది రెండో సెంచరీ.

మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు కోహ్లీ సెంచరీ (101*) తో 197 పరుగులు సాదించింది. భారీ లక్ష్యం తో బరిలోకి దిగిన గుజరాత్ శుభమన్ గిల్ (104*),.విజయ్ శంకర్ (53) రాణించడంతో సునాయాసంగా విజయం సాదించింది. బెంగళూరు ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు చేసింది. ముంబై ప్లేఆప్స్ కి చేరింది.