హైదరాబాద్ (జనవరి – 02) : ఒకే దేశం ఒకే పన్ను నినాదంతో అమలులోకి వచ్చిన గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్ (GST). దీనిని 122వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద రాజ్యాంగ (101వ సవరణ) చట్టం 2016గా అమలులోకి వచ్చింది.. పూర్తి స్థాయిలో 2017 జూలై 01 నుండి దేశంలో జీఎస్టీ అమలులోకి వచ్చింది. జూలై ఒకటవ తేదీని జీఎస్టీ డే గా జరుపుకుంంటారు.
రాజ్యాంగలోని 279A (1) ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చైర్మన్ గా రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక శాఖ మంత్రులు సభ్యులుగా జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేశారు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా విధించే పరోక్ష పన్ను ఇది. జిఎస్టి కౌన్సిల్ నాలుగు రకాల పన్నులను నెలకొల్పింది, ఇవి 5, 12, 18, 28 శాతంగా ఉన్నాయి.
జీఎస్టీలో CGST, SGST, IGST అనే మూడు రూపాలు ఉన్నాయి. సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ, ఇంట్రా స్టేట్ జీఎస్టీ..
నెల | GST వసూలు ( కోట్లలో) |
డిసెంబర్ – 2022 | 1,49,507 |
నవంబర్ – 2022 | 1,45,867 |
అక్టోబర్ – 2022 | 1,51,718 |
సెప్టెంబర్ – 2022 | 1,47,686 |
ఆగస్టు – 2022 | 1,43,612 |
జూలై – 2022 | 1,48,995 |
జూన్ – 2022 | 1,41,616 |
మే – 2022 | 1,40,885 |
ఎప్రిల్ – 2022 | 1,67,650 (అత్యధికం) |
మార్చి – 2022 | 1,42,095 |
ఫిబ్రవరి – 2022 | 1,33,026 |
జనవరి – 2022 | 1,40,986 |