నవంబర్ నెలలో GST రాబడి ఎంత.?

2020-21 ఆర్థిక సంవత్సరం నవంబరు‌ నెలకు గానూ వస్తు సేవల పన్ను (GST) వసూళ్లు రూ.లక్ష కోట్లు దాటాయి. రూ.1,04,963 కోట్లు వసూలైనట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. అక్టోబర్‌ మాసంతో పోలిస్తే వసూళ్లు స్వల్పంగా తగ్గగా గతేడాది నవంబరు‌తో పోలిస్తే 1.4 శాతం పన్ను రాబడి పెరిగింది.


నవంబరు నెల వసూళ్లలో CGST కింద రూ.19,189 కోట్లు, SGST కింద రూ.25,540 కోట్లు, IGST కింద రూ.51,992 కోట్లు, దిగుమతులపై పన్ను ద్వారా రూ.22,078 కోట్లు, సెస్‌ కింద మరో రూ.8,242 కోట్ల వసూలు అయినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.

Follow Us@