GROUP 4 : 141 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల పెరుగుదల

హైదరాబాద్ (జనవరి – 29) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) గ్రూప్ – 4 ఉద్యోగాల కోసం విడుదల చేసిన నోటిఫికేషన్ లో పోస్ట్ కోడ్ నెంబర్ – 11 లో 141 ఉద్యోగాలను కలుపుతూ నిర్ణయం తీసుకుంది. పోస్టుల సంఖ్య 289 నుంచి 430 కి పెరిగింది. దీంతో గ్రూప్ – 4 నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్న మొత్తం పోస్టుల సంఖ్య 8,180 కి చేరింది.

మహాత్మ జ్యోతిబాపూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంస్థలలో 141 జూనియర్ అసిస్టెంట్ల పోస్టులను ఈ నోటిఫికేషన్ లో జత చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రేపటితో దరఖాస్తు గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ పోస్టులకు కూడా దరఖాస్తు చేసుకున్నట్లేనని టీఎస్పీఎస్సీ పేర్కొన్నది.

వెబ్సైట్ : https://www.tspsc.gov.in/

GOOGLE NEWSJOB NOTIFICATIONS
CURRENT AFFAIRSGENERAL KNOWLEDGE
EDUCATION NEWSHOME PAGE
Follow Us @