GROUP 4 FINAL KEY : త్వరలో విడుదల

హైదరాబాద్ (సెప్టెంబర్ 21) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) 8,180 ఉద్యోగాలకై నిర్వహించిన GROUP – 4 EXAM FINAL KEY ను వారం పది రోజుల్లో ప్రకటించడానికి కసరత్తు ముమ్మరం చేసింది.

ఇప్పటికే ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసిన కమిషన్.. తుది ఫలితాలను వెల్లడించే పనిలో నిమగ్నమైంది. రాష్ట్రంలో 8,180 గ్రూప్-4 ఉద్యోగాలకు 9.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు.

జూలై 1న గ్రూప్ పరీక్ష నిర్వహించగా.. 7,62,872 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఆగస్టు 28న ప్రిలిమినరీ ‘కీ’ ని టీఎస్పీఎస్సీ విడుదల చేసింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 4 వరకు ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలు స్వీకరించారు. అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై నిపుణుల కమిటీ కమిషన్ కు తుది నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.

ఈ నేపథ్యంలో పదిరోజుల్లోగా ఫైనల్ కీ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసినట్టు సమాచారం. తుది ఫలితాలను అక్టోబర్ నెలలో ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నది.