హైదరాబాద్ (జూలై – 23) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించింన GROUP 4 EXAM RESULTS ను సెప్టెంబర్ లో విడుదల చేయాలని తీవ్ర కసరత్తు చేస్తోంది.
ఆగస్టు మొదటి వారంలో గ్రూప్-4 ప్రిలిమినరీ కీ విడుదల చేసేందుకు TSPSC ఏర్పాట్లు చేస్తోంది. ఆ తర్వాత వారం రోజుల పాటు అభ్యంతరాలకు అవకాశం ఇచ్చి, ఫైనల్ కీ విడుదల చేయనుంది. ఈ ప్రక్రియ అంతా ఆగస్టులో పూర్తి చేయడానికి ఏర్పాటు చేస్తుంది.
ఇప్పటికే OMR షీట్ల స్కానింగ్ ప్రక్రియ పూర్తయింది. 20 రోజుల్లో 7.62 లక్షల OMR పత్రాలను స్కానింగ్ చేశారు.