GROUP 4 HALL TICKETS : ఈ వారాంలో హాల్ టికెట్లు విడుదల

హైదరాబాద్ (జూన్ – 22) : గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహణకు టీఎస్పీఎస్సీ సమాయత్తమైంది. మొత్తం 8,180 గ్రూప్-4 సర్వీసు పోస్టులకు జులై 1న రాతపరీక్ష నిర్వహించేందుకు
ఏర్పాట్లు చేసింది. ఒకేసారి 9.51 లక్షల మంది హాజరు కానున్నారు. టీఎస్పీఎస్సీ చరిత్రలో ఈ స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేయడం ఇది రెండో సందర్భం.

గ్రూప్-4 పరీక్షకు ఈ వారాంతంలో హాల్ టికెట్లు జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో పోస్టుకు సగటున 116 మంది పోటీపడనున్నారు. ఇవి జిల్లా స్థాయి పోస్టులు కావ డంతో ఒక్కో జిల్లాలో పోటీ పడుతున్న అభ్య సగటులో వ్యత్యాసం ఉండనుంది.

◆ పరీక్ష విధానం :

పేపర్-1: ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు
ప్రశ్నలు: 150, ఒక్కోప్రశ్నకు ఒక మార్కు

పేపర్-2: మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు
ప్రశ్నలు: 150, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు