BIKKI NEWS (NOV. 23) : GROUP 4 APPOINTMENT ORDERS. గ్రూప్ – 4 ఉద్యోగాల్లో అర్హత సాధించిన 8,180 మందికి వారంలో రోజుల్లో నియామక పత్రాలు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అందించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
GROUP 4 APPOINTMENT ORDERS
ఇప్పటికే తుది ఫలితాలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జిల్లాల వారీగా జాబితాలను జిల్లా ఆ కార్యాలయాలకు పంపింది.
వివిధ విభాగాలకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను వేరుచేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తికాగానే నియామక పత్రాలు అందజేయనున్నారు.