GROUP 2 – ఒక్కో పోస్టుకు 705 మంది పోటీ

హైదరాబాద్ (ఫిబ్రవరి – 16) : తెలంగాణ రాష్ట్రంలో 783 గ్రూప్-2 (group 2 posts)/ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈరోజుతో ముగిసింది. ఈ పోస్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5,51,901 మంది దరఖాస్తు చేసుకున్నారు.

నిర్దేశిత గడువులోపు కమిషన్ కు అందిన దరఖాస్తుల ప్రకారం ఒక్కో పోస్టుకు సగటున 705 మంది చొప్పున పోటీపడనున్నారు.