GROUP 2 EXAM POSTPONED : గ్రూప్ 2 వాయిదా

హైదరాబాద్ (ఆగస్టు -12) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆగస్టు 29, 30వ తేదీల్లో నిర్వహించిన గ్రూప్ 2 (GROUP 2 EXAM POSTPONED) పరీక్ష వాయిదా వేయాలని సీఎం కేసీఆర్ సిఎస్ శాంతి కుమారికి సూచించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.

రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థులు గ్రూప్ 2 వాయిదా కోసం పట్టుబడుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ శాంతి కుమారి… టిఎస్పిఎస్సి అధికారులతో చర్చించి గ్రూప్ 2 పరీక్షలు వాయిదా పై నిర్ణయం తీసుకోనున్నారు అలాగే తదుపరి ఎప్పుడు ఈ పరీక్షలు నిర్వహిస్తారో ప్రకటించనున్నారు.