TSPSC : గ్రూప్ – 2 పరీక్షలు యాధాతధం

హైదరాబాద్ (జూలై – 31) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆగస్టు 29,30వ తేదీల్లో నిర్వహించనున్న GROUP – 2 EXAM DATES మార్చే అవకాశం లేదని సమాచారం. అక్టోబర్ లో దసరా సెలవులు ఉండటం, ఆ తర్వాత నవంబర్ లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో షెడ్యూల్ ప్రకారమే గ్రూప్-2 పరీక్ష నిర్వహించాలని అభ్యర్థులు కోరుతున్నారు.

ఒకవేళ వాయిదా వేస్తే మళ్ళీ 2023 లో ఈ పరీక్ష నిర్వహించడానికి తేదీలు దొరకనంతగా పరీక్షల షెడ్యూల్ ఉంది. కావునా గ్రూప్ – 2 పరీక్షలను యాధాతధంగా ఆగస్టు 29,30 తేదీల్లో నిర్వహించండానికే TSPSC మొగ్గు చూపుతుంది.