CM KCR గ్రూప్-2 పరీక్ష యధాతథం

హైదరాబాద్ (ఆగస్టు – 07) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) ఆగస్టు 29, 30 వ తేదీలలో నిర్వహించనున్న గ్రూప్-2 పరీక్ష షెడ్యూల్ ప్రకారమే జరగనుందని సీఎం కేసీఆర్ (CM KCR) అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

పరీక్ష వాయిదా వేయాలని ఇటీవల కొంతమంది డిమాండ్ చేశారని. దీనిపై సీఎం కేసీఆర్.. సీఎస్ శాంతికుమారితో చర్చించి, అన్ని విషయాలు పరిశీలించిన తర్వాత గ్రూప్-2 పరీక్ష యథావిధిగా కొనసాగుతుందని అసెంబ్లీ వేదికగా స్పష్టతను ఇచ్చారు.

మిగిలిన పరీక్షల నిర్వహణపై మరోసారి అధికారులతో చర్చించాలని సీఎస్ ను ఆదేశించారు.