హైదరాబాద్ (జూన్ – 07) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ జూన్ 11 నిర్వహించనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష విషయంలో జోక్యం చేసుకోలేమని తెలంగాణ హైకోర్టు చెప్పింది.
అయితే పెండింగ్ లో ఉన్న పలు పిటీషన్లను విచారణ చేపడతామని అందుకు ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది.
దీనితో గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 11న యధాతధంగా జరగనుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే టీఎస్పీఎస్సీ చేపట్టింది.