BIKKI NEWS (FEB. 20) : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ -1 నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ పోస్టులను భర్తీ చేయనున్నారు.మొత్తం 563 పోస్టులకుగాను ఖాళీల వివరాలు, అర్హతలను (Group 1 posts and qualifications) కింద ఇవ్వడం జరిగింది.
అభ్యర్థులు వయోపరిమితి, విద్యార్హతల ఆధారంగా ఆయా పోస్టులకు అర్హులవుతారు. కొన్ని పోస్టులకు మాత్రం ప్రత్యేకమైన విద్యార్హతలు అవసరం కాగా వాటి వివరాలిలా ఉన్నాయి*
★ విద్యార్హతలు
రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ (ఆర్టీవో) ఉద్యోగాలకు బీటెక్ మెకానికల్, ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తిచేసి ఉండాలి.
అసిస్టెంట్ ట్రెజరీ అధికారి ఉద్యోగానికి డిగ్రీలో కామర్స్, ఎకనామిక్స్ లేదా గణితం సబ్జెక్టుల్లో కనీసం సెకండ్ క్లాస్‌లో ఉత్తీర్ణులై ఉండాలి.
అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ పోస్టుకు ఆర్ట్స్, సైన్స్, కామర్స్ డిగ్రీ వారు అర్హులే అయినా. ఇద్దరు అభ్యర్థులకు సమాన మార్కులు వస్తే లేబర్ వెల్ఫేర్ అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్/ఇండస్ట్రియల్ లేబర్ రిలేషన్స్ స్పెషలైజేషన్‌తో సోషల్‌వర్క్ పీజీ పూర్తిచేసిన వారికి ప్రాధాన్యమిస్తారు.
మిగతా అన్ని పోస్టులకు ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన వారు పోటీపడవచ్చు.
★ ఖాళీల వివరాలు
