గ్రూప్ – 1 మెయిన్స్ పై కీలక సూచనలు

గ్రూప్ -1 మెయిన్స్ సమాధానాలను సగం ఒక భాష లో, మరో సగం ఇంకో భాషలో రాస్తే ఆ పేపర్ ను ముల్యాంకనం కోసం పరిగణనలోకి తీసుకోరు. మెయిన్స్ కోసం అభ్యర్థి భాషను ఎంచుకుంటాడో ఆ భాషలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.

ఇటీవలే 503 పోస్టులతో విడుదలైన గ్రూప్-1కు సంబంధించిన మెయిన్స్ పరీక్షలు నవంబర్/ డిసెంబర్లో నిర్వహించే అవకాశం ఉన్నది. ఈసారి గ్రూప్ -1ను ఇంగ్లిష్, తెలుగు, ఉర్దూ భాషల్లో రాసుకొనేందుకు అవకాశమిచ్చారు. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు అవసరమని అధికారులు సూచిస్తున్నారు. దరఖాస్తు చేసేటప్పుడే ఏ భాషలో రాయాలనుకొంటున్నారో పేర్కొనాలి. తెలుగు ఆప్షన్ ఎంచుకొన్నవారు తెలుగులో మాత్రమే మెయిన్స్ పరీక్ష రాయాలి. సగం ఇంగ్లిష్, మరో సగం తెలుగులో రాయకూడదు. మెయిన్స్లో 6 పేపర్లు ఉండగా, అన్నింటికీ అభ్యర్థులు హాజరవ్వాలి. ఏ ఒక్క పరీక్షకు హాజరుకాకపోయినా అర్హత కోల్పోయినట్టేనని అధికారులు తెలిపారు.

Follow Us @