ఆనందయ్య మందుకు ప్రభుత్వం పచ్చ జెండా

కంట్లో వేసే డ్రాప్స్ కి ఇంకా రాని అనుమతి

కరోనాకు విరుగుడుగా పేరుపొందిన “ఆనంద‌య్య కరోనా మందుకు” ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది.
జాతీయ ఆయుర్వేద పరిశోధన సంస్థ ( CCRAS) క‌మిటీ నివేదిక ప్ర‌కారం ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యం తీసుకుంది.

అయితే ఆక్సిజన్ లెవల్స్ పెంచే కంట్లో వేస్తున్న మందుకు త‌ప్ప ఆనంద‌య్య ఇస్తున్న మిగతా మందులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే డ్రాప్స్‌కు సంబంధించి పూర్తి నివేదిక రావాల్సి ఉంద‌ని ప్ర‌భుత్వం తెలిపింది. అవి రావ‌డానికి 2- 3 వారాలు స‌మ‌యం ప‌డుతుంద‌ని వివ‌రించింది.

K అనే మందును క‌మిటీ ముందు ప్రదర్శించలేదు కనుక CCRAS దీని పంపిణీ కి నిరాక‌రించింది. ఆనంద‌య్య మందు వాడితే క‌రోనా త‌గ్గుతుంద‌నడానికి నిర్ధార‌ణ‌లు కూడా లేవ‌ని నివేదిక‌లు తేల్చాయి.

ఈ మందు వాడినంత మాత్రాన మిగ‌తా మందులు వాడ‌కుండా ఉండొద్ద‌ని ప్ర‌భుత్వం సూచించింది. ఈ క్ర‌మంలో ఆనంద‌య్య ఇచ్చే P, L, F మందులు వాడొచ్చ‌ని స్పష్టం చేసింది.

ఆనంద‌య్య ఔష‌ధం కోసం పంపిణీ కేంద్రం వద్దకు కొవిడ్ రోగులు వెళ్లొద్ద‌ని.. వారి బంధువులే వెళ్లాలని సూచించింది. మందు పంపిణీ వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్ర‌భుత్వం ఆదేశించింది.

Follow Us@