గ్రీన్ హైడ్రోజన్ పాలసీ కి కేంద్రం అమోదం

గ్రీన్ హైడ్రోజన్ పాలసీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను గురువారం కేంద్ర విద్యుత్తు మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. నేషనల్ హైడ్రోజన్ మిషన్ (ఎన్‌హెచ్ఎం)లో భాగంగా ఈ పాలసీ ని ప్రవేశపెట్టారు.

2030 నాటికి 5 మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నది.

గ్రీన్ హైడ్రోజన్ లేదా అమ్మోనియా తయారీదారులు పవర్ ఎక్స్చేంజ్ నుంచి పునరుత్పాదక శక్తిని కొనుగోలు చేసుకోవడానికి లేదా స్వయంగా వారే తయారు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.

దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో ఓపెన్ యాక్సెస్ మంజూరు చేస్తారు.

పునరుత్పాదక శక్తికి 30 రోజుల వరకూ పంపిణీ సంస్థతో బ్యాంకింగ్ చేసుకోవడానికి, అవసరమైనప్పుడు దానిని తిరిగి తీసుకోవడానికి వెసులుబాటు ఉంటుంది.

డిస్ట్రిబ్యూషన్ లైసెన్సీలు తమ రాష్ట్రాల్లోని తయారీ దారులకు పునరుత్పాదక ఇంధనాన్ని సేకరించి సరఫరా చేసుకోవచ్చని ప్రకటించింది.

2025 జూన్ 30కి ముందు ప్రారంభించిన ప్రాజెక్టుల కోసం తయారీదారులకు 25 ఏండ్లపాటు అంతర్రాష్ట్ర ప్రసార చార్జీలు మినహాయింపును కల్పించారు.

ఉత్పత్తి ముగింపులో ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ సిస్టమ్ (ఐఎసీఎస్)కి మినహాయింపు ఇవ్వనున్నట్టు, ఎగుమతి, గ్రీన్ అమ్మోనియా నిల్వల కోసం ఓడరేవుల దగ్గర బంకర్ల ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నట్టు కేంద్రం తెలిపింది.

Follow Us @