కోవిడ్ పాజిటివ్ వచ్చిన కాంట్రాక్ట్ లెక్చరర్లకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి – కొప్పిశెట్టి సురేష్ బృందం

ప్రభుత్వ జూనియర్ డిగ్రీ & పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్స్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లయితే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కొద్దిసేపటి క్రితం గౌరవనీయులు ఇంటర్ విద్యా కమిషనర్ మరియు డిగ్రీ మరియు పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి కమిషనర్ అయినా సయ్యద్ ఉమర్ జలీల్ కి విన్నవించడం జరిగిందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కళాశాలల కాంట్రాక్ట్ లెక్చరర్స్ అసోసియేషన్ (T.S.G.CCLA)
రాష్ట్ర అధ్యక్ష ,కార్యదర్శులు G.రమణా రెడ్డి, డాక్టర్ కొప్పిశెట్టి సురేష్ తెలిపారు.

ప్రస్తుతం covid -19 సెకండ్ వేవ్ విపరీతంగా ప్రభావం చూపిస్తోందని, దీనివలన ప్రభుత్వ జూనియర్, డిగ్రీ మరియు కళాశాలలో పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తూ అనేక మంది కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారని, కొంతమంది కాంట్రాక్ట్ లెక్చరర్స్ చనిపోవటం కూడా జరిగిందని తెలిపారు.

అయితే కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఏ విధమైన సెలవలు లేకపోవడం వలన ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతూ చికిత్సకు అప్పులు చేయవలసి వస్తుందని తెలిపారు. అదే విధంగా చికిత్స సమయంలో సెలవులు లేకపోవడం వల్ల కళాశాలల్లో వేతనము కోత వలన ఆర్థికంగా నష్టపోతున్నామని తెలిపారు.

ఈ విషయంపై గత కొద్ది రోజుల క్రితమే కరోనా పాజిటివ్ వచ్చిన కాంట్రాక్ లెక్చరర్ కు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని విద్య శాఖ మంత్రికి మరియు ఉన్నత విద్యాశాఖ అధికారులకు & కమీషనర్ కి గౌరవ ఎమ్మెల్సీలు డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరియు శ్రీ నర్సిరెడ్డి ద్వారా, వారి నుంచి మా సంఘం తరఫున ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని తెలిపారు.

ఆ సందర్భంగా ఇంటర్ విద్యా కమిషనర్ ఏ డిపార్ట్మెంట్ లో నైనా కరోనా పాజిటివ్ వచ్చిన కాంట్రాక్టు ఉద్యోగులకు సెలవులు ఇచ్చినట్లయితే, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లు కూడా కరోనా పాజిటివ్ వచ్చినవారికి వేతనంతో కూడిన సెలవు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారని కొప్పిశెట్టి ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఈరోజు తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో పనిచేస్తున్నా కాంట్రాక్టు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వస్తే 14 రోజులు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ప్రోసిడింగ్ రావడం జరిగిందని ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంటర్ విద్య కమిషనర్ దృష్టికి ఈ ప్రొసీడింగ్ తీసుకు వెళ్లడం జరిగింది.

వెంటనే ప్రభుత్వ జూనియర్ మరియు డిగ్రీ కళాశాలలో మరియు పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు covid – 19 పాజిటివ్ వస్తే వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ వస్కుల శ్రీనివాస్, రాష్ట్ర కోశాధికారి నాయన శ్రీనివాస్ ,రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ శోభన్ బాబు, ఉపాధ్యక్షుడు కురుమూర్తి, అధికార ప్రతినిధులు కాంపల్లిశంకర్, సయ్యద్ జబీ ఉల్లా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు , వైకుంఠం, ప్రవీణ్, దేవేందర్, సంగీత, శైలజ, ఉదయశ్రీ, రమాదేవి తదితరులు కోరారు.

Follow Us@